Wednesday, April 3, 2013

Wallstreet లో కొన్ని దృశ్యాలు ...

Wallstreet లో కొన్ని దృశ్యాలు ...





Federal Reserve Bank of America....opposite to my office..

Newyork Stock Exchange

Newyork Stock Exchange...just few steps from my office


WTC Path Station

WTC Path Station

WTC Path Station

New WTC Towerin under construction... just beside of the actual WTC Twin Towers....

Tuesday, April 2, 2013

Newyork city లో నా తోలి రోజు....


Newyork city లో నా తోలి రోజు....

నిన్నే newyork city కి వచ్చాను, ఇది నా మొదటి US ప్రయాణం , Jersey City లో ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8:00 అయింది. హైదరాబాద్ నుండి బయలుదేరి 24 గంటల ప్రయాణం చేసేసరికి తల ప్రాణం పాదాలలోకి వచినట్లు అయింది. ఈ ప్రయాణం వల్లే నాకు Jet Lag అనే ఒక విషయం తెలిసింది. Jet Lag అనేది ఒక రకమైన మానసిక వ్యాధి , ఇది దూరప్రయాణం చేసిన వాళ్ళకి ఎక్కువగా వస్తుందంట. ఒక Time zone నుంచి ఇంకొక Time jone లోకి ప్రయాణం చేస్తే ఈ Jet Lag కి దొరికిపోయే అవకాశాలు ఎక్కువ. అలా అని ఇది ఏమంత ప్రమాదమైనది కాదు కాని, దీనివళ్ల రెండు, మూడు రోజులు లేక వారం రోజులు కొన్నినిద్ర సమస్యలు వస్తాయి. ప్రధానంగా మనం West-To-East గనుక ట్రావెల్ చేస్తే నిద్ర తొందరగా పట్టకపోవటం, East-To-West గనుక ట్రావెల్ చేస్తే తెల్లవారకముందే నిద్ర లేవడం లాంటి సమస్యలు వస్తాయని తెలిసింది. ఇప్పుడు నాది రెండవ స్తితి.  

ఈ పరిస్థిలో ఈ రోజు నేను ఆఫీసు కి వెళ్ళాను. మా ఆఫీసు Newyork లోని Manhattan లో వుంది. నేను పుట్టింది, పెరిగింది , MCA వరకు చదువుకుంది నెల్లూరు జిల్లా లో కావలి అనే చిన్న పట్టణం లోనే, మహా అయితే Hyderabad, Bangalore, Chennai లాంటి పట్టణాలను  చూసాను , ఇంకా చెప్పుకుంటే South Africa లో Johannesburg ని కుడా చూసాను, కాని నా కళ్ళకి Manhattan ఒక అద్బుతంలా కనిపించింది, ప్రపంచంలో మరే పట్టణం దీనికి సాటి రాదేమో....అంత త్తున్న భవనాల మనల్ని చుట్టుముట్టినట్లు వుంది, సూర్యుడిని చూడాలన్నా మిట్ట మధ్యానం మాత్రమే చూడగలం అదీ తల ఫైకెతి నిటారుగా చూస్తేనే !!!

నాకు ఒకింత గర్వం గా కుడా అనిపించింది...ఎక్కడో కావలి లో చదువుకున్న నాకు manhattan  లొ ఉద్యోగం రావడం కొంచెం గర్వంగా కుడా అనిపించింది...

ఇక్కడ ప్రతి అడుగు ఒక విచిత్రం, విశేషం....ప్రతి సందు, ప్రతి భవనం చారిత్రాత్మకం.....WTC పునఃనిర్మానం  నుండి చీమలపుట్టలా వున్నా underground subway rail వరకు ప్రతిదీ ఆసక్తిదాయకం...

అందుకే manhattan గురించి నేను చూసిన, తెలుసుకుంటున్న సంగతులను వివరిస్తూ నేను రేపు మల్లి కలుస్తాను .....

రేపు నేను తీసిన కొన్ని PHOTOS పోస్ట్ చేస్తాను...అంతవరకు......

Newyork Manhattan
Reference #1

Newyork Manhattan
Reference #2